The Warriorr - మూవీ షూటింగ్ అప్ డేట్స్

Monday,May 30,2022 - 01:23 by Z_CLU

Ram Pothineni Starrer ‘The Warriorr’ Shooting Updates

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో హీరో రామ్ కనిపించనున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

గత వారం రోజులుగా హీరో రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దీన్ని తెరకెక్కించారు. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి.

సినిమాకు సంబంధఇంచి ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉందని చెబుతున్నారంతా. టీజర్‌లో డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా హై స్టాండ‌ర్డ్స్‌లో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. త్వరలోనే మిగతా పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. అక్షర గౌడ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

ram warrior movie

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics