Alludu Adhurs - ఒక రోజు ముందే రిలీజ్

Monday,January 11,2021 - 11:51 by Z_CLU

ఈ సంక్రాంతికి రవితేజ Krack , విజయ్ Master(డబ్బింగ్), రామ్ Red , బెల్లంకొండ శ్రీనివాస్ Alludu Adhurs సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రాక్ థియేటర్స్ లో హంగామా చేస్తూ భారీ వసూళ్ళు రాబడుతుంది. అయితే ముందుగా ప్రకటించిన జనవరి 15 కంటే ఒకరోజు ముందే వచ్చేస్తుంది ‘అల్లుడు అదుర్స్’. క్రాక్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ముందు నుండి జనవరి 14 విడుదల అంటూ సినిమాను ప్రమోట్ చేసిన మేకర్స్ ఐదు రోజుల ముందే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చారు.

ఇప్పుడు అల్లుడు అదుర్స్ డేట్ కూడా ప్రీ పోన్ చేసుకున్నారు మేకర్స్. ముందు నుండి చెప్పినట్టు కనుమ కి కాకుండా రెడ్ తో పాటే సంక్రాంతి రోజు రానుంది అల్లుడు అదుర్స్. ఈ విషయాన్ని నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఫీషియల్ గా ప్రకటించారు. నేటి నుండి కొత్త డేట్ తో సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. మరి ఒకే రోజు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్, శ్రీనివాస్ ఇద్దరు సంక్రాంతి బరిలో ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.