సందీప్ కిషన్ ‘నెక్స్ట్ ఏంటి..? ఫస్ట్ లుక్ రిలీజ్

Friday,November 09,2018 - 12:30 by Z_CLU

యంగ్ హీరో సందీప్ కిషన్, తమన్నా జంటగా కనిపించనున్నారు. ఈ రోజే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ లో ఫనా, హమ్ తుమ్ లాంటి సెన్సేషనల్ హిట్స్ కి దర్శకత్వం వహించిన కునాల్ కోహ్లీ ఈ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

టైటిల్ కి తగ్గటే ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. తమన్నా, సందీప్ కిషన్ తో పాటు పూనమ్ కౌర్, నవదీప్ సినిమాలో కీ రోల్స్ లో కనిపించనున్నారు. మ్యాగ్జిమం సినిమాని లండన్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో తెరకెక్కించిన ఫిల్మ్ మేకర్స్ డిసెంబర్  లో ఈ సినిమాని  రిలీజ్ చేసే ఆలోచనలో  ఉన్నారు.

ఈ సినిమాకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రైనా జోషి, అక్షయ్ పూరి ఈ సినిమాని సంయుక్తంగా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.