‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాహీరో

Tuesday,April 24,2018 - 12:55 by Z_CLU

రీసెంట్ గా మిలిటరీ మాధవరంలో గ్రాండ్ గా ఆడియో లాంచ్ జరుపుకుంది నా పేరు సూర్య టీమ్. ఇప్పుడు అదే స్పీడ్ లో ఈ నెల 29 న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. అయితే ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నాడు. దాంతో ఒకే వేదికపై కనిపించనున్న మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్  ఇవ్వబోయే స్పీచ్ పైనే మెగా ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ ఫిక్స్ అయి ఉంది.

భారీ స్థాయిలో జరగనున్న ఈ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సూపర్ హిట్టయింది. ఇమోషనల్ యాక్షన్ ఎంటర్  టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు వక్కంతం వంశీ.

 

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ నటించింది. ఇక నదియా బన్నికి తల్లిగా ఇమోషనల్  రోల్ లో మెస్మరైజ్ చేయనుంది. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు, తల్లి కొడుకుల మధ్య ఉండబోయే ఇమోషనల్ సీక్వెన్సెస్ సినిమాలో హైలెట్ కానున్నట్టు తెలుస్తుంది. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు.