మరోసారి పోలీసాఫీసర్ గా రవితేజ...

Tuesday,April 24,2018 - 12:25 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు రవితేజ. రీసెంట్ గా ‘నేల టికెట్టు’ సినిమా  షూటింగ్  కి  ప్యాకప్ చెప్పాడో లేదో  అప్పుడే  మరో సినిమాతో సెట్స్ పైకి రావడానికి ప్రిపేర్ అయిపోయాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘తెరి’ రీమేక్ లో పోలీసాఫీసర్ గా పవర్ ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు మాస్ మహారాజ్.

పోలీసాఫీసర్ గెటప్ రవితేజ కి కొత్తేం కాదు. గతంలో రవితేజ ఫుల్ ఫ్లెజ్డ్ పోలీసాఫీసర్ గా  విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్ లాంటి సినిమాలతో  పాటు రీసెంట్ గా ‘టచ్ చేసి చూడు’  సినిమాలో  డిఫెరెంట్   మ్యానరిజం తో ఇంప్రెస్ చేశాడు.  ఇప్పుడు  సంతోష్ శ్రీనివాస్  డైరెక్షన్  లో తెరకెక్కనున్న  ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరోసారి   పవర్  ఫుల్  పోలీసాఫీసర్  గా  మెస్మరైజ్  చేయనున్నాడు మాస్ మహారాజ్.

ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా కేథరిన్ ని ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, మరో హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.