Mega Princess మెగా వారసురాలు వచ్చేసింది

Tuesday,June 20,2023 - 10:05 by Z_CLU

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.  తెల్లవారు జామున ఉపాసనకి డెలివరీ అయింది. ఈ మెగా శుభవార్త తెలియగానే చిరు కుటుంబం ఉదయాన్నే అపోలో హాస్పిటల్ కి వెళ్ళి  బిడ్డను చూసొచ్చారు.

చిరంజీవికి తొలి సంతానం అమ్మాయి లాగే ఇప్పుడు చరణ్ కి కూడా తొలి సంతానంగా పాప పుట్టింది. ఇక మెగా స్టార్ చిరంజీవి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న తాత ప్రమోషన్ నేటికి దక్కింది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ కి మెగా బంధువులు , అల్లు కుటుంబం , కామినేని కుటుంబ సభ్యులు విచ్చేసి మెగా ప్రిన్సెస్ ను ఆశీర్వదించనున్నారు. ఈ గుడ్ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ చరణ్ , ఉపాసనలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.