ప్రగ్యా జైస్వాల్ ఇంటర్వ్యూ

Tuesday,April 24,2018 - 02:23 by Z_CLU

ఈ నెల 27 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది ఆచారి అమెరికా యాత్ర. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఈ సినిమాలో హిలేరియస్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నాయి. ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ మీడియాతో చాలా ఎగ్జైటెడ్ గా మాట్లాడింది. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

అదే సినిమా…

‘ఆచారి అమెరికా యాత్ర’ కంప్లీట్ కమర్షియల్ హిలేరియస్ ఎంటర్ టైనర్. సినిమాలో కావాల్సినంత మాస్ మసాలా, కామెడీ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా.

 

ఇక నా క్యారెక్టర్ విషయానికొస్తే…

N.R.I. లా కనిపిస్తాను ఈ సినిమాలో. ఒక అకేషన్ కోసం ఇండియాకి వస్తాను. అలా లవ్ స్టోరీ బిగిన్ అవుతుంది. కాకపోతే ఈ లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది . ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి విష్ణు & బ్రహ్మానందం గారు U.S. కి రావడం, అక్కడ సినిమా ఫన్ జోన్ బిగిన్ అవుతుంది. నా క్యారెక్టర్ ఇందులో చాలా ఇమోషనల్ గా ఉంటుంది.

మరీ ట్రెడిషనల్ కాదు…

సినిమాలో మరీ ట్రెడిషనల్ గా ఉండను. ఒకటి రెండు సిచ్యువేషన్స్ లో కొంచెం ట్రెడిషనల్ గా కనిపిస్తాను కానీ, చాలా ఫన్ లవింగ్ గర్ల్ గా ఉంటాను…

ఆక్సిడెంట్ జరిగింది…

మేము U.S. లో బైక్ చేజింగ్ సీన్ చేస్తున్నప్పుడు ఆక్సిడెంట్ జరిగింది. గాయాలైనా పెద్దగా ఏమీ జరగలేదు కాబట్టి ఆల్ హ్యాప్పీస్. త్వరలో మీరు ఆ వీడియోని యూ ట్యూబ్ లో చూస్తారు.

డైరెక్టర్ మార్క్ కామెడీ…

నా కరియర్ లో ఇదే ఫస్ట్ కామెడీ సినిమా. డెఫ్ఫినేట్ గా డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారి దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్ అనిపిస్తుంది. ఆయన మార్క్ సినిమాలో కనిపిస్తుంది.

ఒక్క ఇమోషన్ చుట్టూ…

సినిమాలో హీరోయిన్ కి తన తాత అస్థికలు కాశీలో కలపాలని ఒక ఇమోషన్ ఉంటుంది. ఆ ఒక్క ఇమోషన్ చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. ఈ ప్రాసెస్ లో బ్రహ్మానందం కూడా కనెక్ట్ అవ్వడంతో కామెడీ జెనెరేట్ అవుతుంది. ఈ సినిమాలో నేను కామెడీ చేయను.

ఇద్దరినీ కంపేర్ చేయలేం…

మనోజ్, విష్ణులిద్దరూ డిఫెరెంట్ పర్సనాలిటీస్. ఇద్దరినీ అసలు కంపేర్ చేయలేం. మనోజ్ చాలా జోవియల్ గా ఉంటాడు. సెట్స్ పై చాలా ఆక్టివ్ గా, జోక్స్ వేస్తూ ఉంటాడు. ఇక విష్ణు విషయానికి వస్తే చాలా డిసిప్లిన్ గా ఉంటాడు. ప్రతీది పర్ఫెక్ట్ గా ఉందా లేదా చూసుకుంటూ ఉంటాడు.

నా ఫేవరేట్ సాంగ్…

సినిమాలో ‘స్వామి రారా’ సాంగ్ సిచ్యువేషనల్ గా ఉంటుంది. అది నాకు ఫేవరేట్ సాంగ్. కానీ చాలా మందికి ‘చెలియా’ సాంగ్ నచ్చింది.

అదృష్టంగా ఫీలవుతున్నాను…

ఇంత తక్కువ టైమ్ లో డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో నటించే చాన్స్ వచ్చినందుకు అదృష్టంగా ఫీలవుతున్నాను. కంచె  కంప్లీట్ పీరియాడిక్ ఫిల్మ్. అందులో ప్రిన్సెస్ లా, నక్షత్రం లో సీరియస్ కాప్ లా, ఇప్పుడు ఈ కామెడీ ఎంటర్ టైనర్.. ఇంత తక్కువ టైమ్ లో డిఫెరెంట్ జోనర్స్ లో అవకాశాలు వస్తున్నాయి. హ్యాప్పీగా ఫీలవుతున్నా…