Hello World ఆగస్ట్ 12న స్ట్రీమింగ్

Wednesday,July 27,2022 - 03:00 by Z_CLU

ZEE5 ‘Hello World’, a new Original series streams from August 12

ZEE5 ఇప్పటి వరకు ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తూ వచ్చింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి వచ్చిన కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ఇటీవల వచ్చిన ‘రెక్కీ’, ‘మా నీళ్ళ ట్యాంక్’ కూడా సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచుకున్నాయి.

ఇప్పుడు Zee5 నుండి మరో ఎక్సలెంట్ సిరీస్ రాబోతుంది. ఎనిమిది ఎపిసోడ్స్ తో ఆఫీస్ డ్రామాగా తెరకెక్కిన ‘హలో వరల్డ్’ ఆగస్ట్ 12న స్ట్రీమింగ్ అవ్వబోతుంది. శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బేనర్ పై నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సిరీస్ లో ఆర్యన్ రాజేష్ , సదా , రామ్ నితిన్ , నయన్ కృష్ణ నిఖిల్ , అనిల్ , సుదర్శన్ గోవింద్ , నిత్యా శెట్టి ,అపూర్వ రావు , స్నేహ , రవి వర్మ , జయప్రకాశ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ఐటి కంపెనీలో జాయిన్ అయిన ఫ్రెషర్స్ కథతో హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సిరీస్ కి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ సిరీస్ కోసం యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ‘హలో వరల్డ్’ టీజర్, ట్రైలర్ కంటెంట్ పై మరిన్ని అంచనాలు పెంచానున్నాయి.

 

 

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics