సూర్య సినిమా నుండి తప్పుకున్న అల్లు శిరీష్

Friday,July 20,2018 - 02:03 by Z_CLU

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది సూర్య 37 సినిమా. అయితే ఈ సినిమా నుండి అల్లు శిరీష్ తప్పుకున్నట్టు ఈ రోజే సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ABCD సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు శిరీష్, డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు కన్ఫమ్ చేశాడు.

సూర్య కరియర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు, బోమన్ ఇరానీ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. సూర్య ఈ సినిమాలో 4 డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఏకంగా 10 దేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా K.V. ఆనంద్ డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.

సూర్య 37 టీమ్ అల్లు శిరీష్ ని ఏ రోల్ కోసం పిక్ చెసుకున్నారనేది ప్రస్తుతానికి రివీల్ కాకపోయినా, ఇప్పుడు అల్లు శిరీష్ ప్లేస్ లో ఏ స్టార్ రీప్లేస్ అవ్వనున్నాడనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. మరోవైపు ఈ రోల్ లో ఆర్య నటించే చాన్సెస్ ఉన్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే చక్కర్లు కొడుతుంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.