Weekend Release - మెయిన్ ఎట్రాక్షన్ రిపబ్లిక్

Wednesday,September 29,2021 - 03:52 by Z_CLU

లవ్ స్టోరీ సినిమాతో థియేట్రికల్ బిజినెస్ పై టాలీవుడ్ కు ఓ ఐడియా వచ్చేసింది. తమ సినిమాల్ని ధైర్యంగా రిలీజ్ చేసుకోవచ్చనే నమ్మకం కుదిరింది. దీంతో పెద్ద సినిమాలతో పాటు మీడియా రేంజ్ బడ్జెట్ సినిమాలన్నీ వరుసగా తమ రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమా రిపబ్లిక్.

సాయితేజ్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా రిపబ్లిక్. దేవ కట్టా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే ట్రయిలర్ పెద్ద హిట్టవ్వడంతో సినిమా హాట్ టాపిక్ గా మారింది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, కాలేజ్ సాంగ్‌తో పాటు జోర్ సే.. సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సాయితేజ్ యాక్టింగ్‌, దేవ్ క‌ట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.

అక్టోబర్ 1న రిపబ్లిక్ థియేటర్లలోకి వస్తోంది. ఇక అక్టోబర్ 2న ఇదే మా కథ, అసలు ఏం జరిగిందంటే, ఆట నాదే వేట నాదే అనే 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో కాస్త బజ్ ఉన్న సినిమా ఇదే మా కథ. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక నటించిన ఈ సినిమా ఓ రోడ్ మూవీ. ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తులు బైక్ జర్నీ చేసుకుంటూ ఎలా కలిశారు.. చివరికి వాళ్లు నేర్చుకున్నది/తెలుసుకున్నది ఏంటనేది ఈ సినిమా.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న డబ్బింగ్ సినిమా నో టైమ్ టు డై. ఈ జేమ్స్ బాండ్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. జేమ్స్ బాండ్ గా డేనియల్ క్రెగ్ కు ఇదే లాస్ట్ మూవీ. రేపు థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics