ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్ చరణ్ ?

Tuesday,July 26,2016 - 04:45 by Z_CLU

 

సినిమాల్లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చూశాం. నాయక్ సినిమాలో ఇద్దరు చెర్రీలు కనిపిస్తారు. ఇప్పుడు నిజజీవితంలో కూడా రెండు పాత్రలు పోషిస్తున్నాడు చరణ్. ఓవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా కూడా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రేపట్నుంచి మరో షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొంటాడు. అలాగే మరోవైపు చిరంజీవి కూడా తన 150వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఓవైపు ధ్రువ షూటింగ్… మరోవైపు చిరంజీవి సినిమా ప్రొడక్షన్. ప్రస్తుతం ఇలా తీరిక లేకుండా గడుపుతున్నాడు రామ్ చరణ్. ఈ రెండు సినిమాలతో ఇటు హీరోగా సక్సెస్ అందుకుంటూనే… అటు నిర్మాతగా సూపర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. తను పోషిస్తున్న రెండు పాత్రలతో చెర్రీ సక్సెస్ కావాలని కోరుకుందాం.