మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ అదే

Tuesday,July 26,2016 - 04:50 by Z_CLU

 

వచ్చేనెల 9న మహేష్ బాబు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ప్రతి పుట్టునరోజుకు తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక ఎట్రాక్షన్ ను రిలీజ్ చేయడం మహేష్ కు అలవాటు. కుదిరితే ట్రయిలర్, కుదరకపోతే ఫస్ట్ లుక్… ఇలా ఏదో ఒక హంగామా చేయడం కామన్. కానీ ఈసారి మాత్రం బర్త్ డే కు విడుదల చేయడానికి ఏమీ లేదు. మురుగదాస్ తో సినిమాను ఇంకా పట్టాలపైకి తీసుకురాకపోవడంతో… ఆగస్ట్ 9కి విడుదల చేయడానికి మహేష్ వద్ద ఏమీ లేదు. అయినప్పటికీ… కొత్త సినిమాకు సంబంధించి ఒక ఎట్రాక్షన్ ను అభిమానులకు అందించడానికి రెడీ అవుతున్నాడు మహేష్. ఆగస్ట్ 9న తన కొత్త సినిమా ప్రీ-లుక్ ను విడుదల చేసే ఆలోచనలో మహేష్ ఉన్నాడు. కుదిరితే అదే రోజు సినిమా టైటిల్ ను కూడా ప్రకటించడానికి మహేష్ రెడీ అవుతున్నాడట. దీనికి సంబంధించి మురుగదాస్ తో ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద… ఈసారి పుట్టినరోజుకు మహేష్ కొత్త సినిమాకు సంబంధించి అఫీషియల్ గా ఏదో ఒక సమాచారం తెలిసే అవకాశం ఉంది.