విశాల్ సినిమాకు ఆ టైటిల్ ఖరారు ?

Monday,July 25,2016 - 06:23 by Z_CLU

 

విశాల్ తమన్నా జంటగా సూరజ్ దర్శకత్వంలో వి ఎఫ్ ఎఫ్ సమర్పణలో జి హరి నిర్మించనున్న చిత్రానికి ‘ఒకడొచ్చాడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కథ కు విశాల్ పాత్రకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట యూనిట్. ఇక ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ‘రాయుడు’ చిత్రం తో ఓ మోస్తరు విజయం అందుకొన్న విశాల్ హీరో గా తన స్పీడు పెంచాడనే చెప్పాలి. త్వరలోనే లింగుస్వామి దర్శకత్వం లో ‘పందెం కోడి’ సిక్వెల్ లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తో పాటు టెంపర్ తమిళ రీమేక్ అలాగే బాల దర్శకత్వం లో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు విశాల్.