రామ్ చరణ్ ఇంటర్వ్యూ

Tuesday,March 27,2018 - 03:55 by Z_CLU

మార్చి 30 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది రామ్ చరణ్ ‘రంగస్థలం’. ఇప్పటికే టాలీవుడ్ లో ఎక్కడా చూసినా, ఈ సినిమా సీజన్ బిగిన్ అయిందా అనిపిస్తుంది. ఈ సినిమాలో చిట్టిబాబు గా సరికొత్త లుక్ లో, డిఫెరెంట్ మ్యానరిజం తో, యాసతో మెస్మరైజ్ చేయనున్న చెర్రీ, ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పుకున్నాడు. దాంతో పాటు ఈ సినిమా చేసే ప్రాసెస్ లో తన ఎక్స్ పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

 లక్కీగా ఫీలవుతున్నా…

2018 లో రిలీజయింది నా ఫస్ట్ సినిమా ‘చిరుత’. పదేళ్ళ ఈ కరియర్ లో ఏదో కొత్తగా చేయాలి, ఏదో కొత్త మార్పు తీసుకురావాలి అని అనుకుంటున్న టైమ్ లో, సుకుమార్ గారికి ఈ ఆలోచన వచ్చినందుకు లక్కీగా ఫీలవుతున్నాను…

 

ఆయన నమ్మలేదు…

సుకుమార్ గారు ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తరవాత ఒకసారి నన్ను కలిశారు. అప్పుడు నేను ‘ధృవ’ షూటింగ్ లో ఉన్నాను. అప్పుడు ఒకటే మాటన్నారు. ఈ సారి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎంటర్ టైనర్ చేద్దామనుకుంటున్నా’ అన్నారు… అంతే నేను కనీసం కథ కూడా వినకుండా.. కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో ‘నేనీ సినిమా చేస్తున్నా..’ అనేశా… ఆయనైతే ఓ క్షణం నమ్మలేదు… ‘చరణ్ మాటిస్తున్నావ్ తప్పకూడదు..’ అన్నారు.

 

నేను షాకయ్యా…

సుక్కు నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు నాతో అన్న మొదటి మాట.. ‘ఈ సినిమాలో నీకు చెవుడు..’ వినగానే షాకయ్యా… అప్పుడు ఆయన ‘సినిమాలో స్టోరీ కన్నా ముందు నువ్వు వినాల్సింది నీ క్యారెక్టర్’ అన్నారు.. ఆ తరవాత ఆయన స్టోరీ న్యారేట్ చేస్తున్న కొద్దీ మెస్మరైజింగ్ అనిపించింది. అలాంటి స్క్రీన్ ప్లే నేనిప్పటి వరకు వినలేదు. ఈ సబ్జెక్ట్ నా వరకు వచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీలయ్యాను…

సుకుమార్ సరిగ్గా వాడుకున్నాడు…

హీరోకి ఏదో చెవుడు ఉండాలి కాబట్టి అలా చెవిటి వాడిలా పెట్టేసి, ఆ క్యారెక్టర్ ని సుక్కు జస్ట్ అలా వదిలేయలేదు. ప్రతి సీక్వెన్స్ లో… సమంతా కాంబినేషన్ లో కానీ , యాక్షన్ టైమ్ లో కానీ, కామెడీ విషయంలో ప్రతి సిచ్యువేషన్ లో హీరోకి చెవులు వినపడవు కాబట్టే, సీన్స్ కొత్తగా కంపోజ్ అయ్యాయి.. దాంతో సినిమా కొత్తగా అనిపిస్తుంది.

అమ్మానాన్న రియాక్షన్ కూడా…

నేను చేసే ప్రతి సినిమాకి అమ్మా, నాన్న ఇద్దరూ అప్రీషియేట్ చేస్తారు.కానీ ఈ సినిమా చూశాక వాళ్ళు ఆ సినిమా ఫీల్లోంచి బయటికి రావడానికే టైమ్ పట్టింది. ఈ సినిమా చూసే వాళ్ళు, కొన్ని సందర్భాల్లో కన్నీరు పెట్టకుండా ఉండలేరు…

 

గర్వంగా అనిపించింది…

సినిమా సెట్స్ పైకి వచ్చాక ఓ వారం పది రోజుల తరవాత నేను కూడా సుకుమార్ లా ఆలోచించడం మొదలుపెట్టా.. కంప్లీట్ గా చిట్టిబాబు క్యారెక్టర్ లా ఇన్వాల్వ్ అయిపోయాను.. ఎంత ఎంజాయ్ చేశానంటే ప్రైస్ లెస్ ఫీలింగ్. ఈ సినిమా చేసినందుకు నిజంగా నాకు నా మీదే గౌరవం పెరిగిపోయింది…

 

సినిమాలో హైలెట్ అవే…

‘రంగస్థలం’ సినిమాలో హైలెట్ అయ్యేవి… డైలాగ్స్ లో యాస, గెటప్స్, విలేజ్ సెట్… ప్రతీది అంతే న్యాచురల్ గా ఉంటుంది. సినిమాలో కథ తరవాత మళ్ళీ ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేవి అవే..

సమంతాని చైతు గుర్తు పట్టలేదు…

ఉపాసన నా క్యారెక్టర్ తో, యాసతో చాలా హ్యాపీగా ఫీలయ్యేది. ఒక్కోసారి నేను దాన్ని ఇంటికి కూడా క్యారీ చేసేవాణ్ణి. కానీ సమంతా విషయంలో అలా కాదు, నాగ చైతన్య సామ్ ని చూసి ‘ఎవరిది’ అన్నాడట. అంత డిఫెరెన్స్ ని క్రియేట్ చేశాయి మా క్యారెక్టర్స్…

16 రకాల లుక్స్ తరవాత…

సినిమాలో నా లుక్ ఫిక్స్ చేయడం కన్నా ముందు చాలా లుక్స్ ట్రై చేశాం. బెల్ బటన్స్, ప్యాంట్స్ , షర్ట్స్ ఇలా చాలా ట్రై చేశాక చివరికి ఈ లుక్ కి ఫిక్సయ్యాం.

 

అయాన్ కి గిఫ్ట్ చేశా…

అల్లు అర్జున్ వాళ్ళ అబ్బాయి అయాన్ కి పొద్దస్తమానం ఈ సినిమా సాంగ్ వింటూనే ఉంటాడు. రీసెంట్ గా బన్ని వీన్ని అక్కడికే పంపించేస్తాను, ఈ సాంగ్స్ నేనింకా వినలేను అన్నాడు. అయాన్ కోసం ట్రైలర్ లో నేను వేసుకునే బట్టల్లాంటివే, 2 జతలు కుట్టించి గిఫ్ట్ చేశా…

అదే సుక్కు స్పెషాలిటీ…

సుకుమార్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ ని కూడా సినిమాలో ఇన్వాల్వ్ చేస్తాడు. ప్రతీది ఆ సీన్ చేసే ఆర్టిస్ట్ తో డిస్కస్ చేసి చేస్తాడు. ఆయనకేం కావాలో ఆ క్లారిటీ ఆయనకు ఉంటుంది. ఈ 2 లైన్స్ మారడానికి వీల్లేదు.. అని చెప్తూనే దాని ముందు వెనక ఏదైనా  ఆడ్ చేయాలనుకున్నా, తీసేయాలనుకున్నా ఆర్టిస్ట్ కి ఆ లిబర్టీ ఇస్తాడు. అందుకే ఆయన సినిమాలు అంత ఫ్రెష్ గా ఉంటాయి.

సుక్కు టైమ్ తీసుకుంటాడు…

ఒక సినిమాకి ఇంతే టైమ్ పట్టాలి అనే ప్యాటర్న్ ఏమీ ఉండదు. డైరెక్టర్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడీ సినిమాకి 11  నెలలు పట్టింది అంటే… దానికి రిక్వైర్ మెంట్.. సుక్కు టైమ్ తీసుకుంటాడు. ఆయనతో సినిమా చేస్తున్నామంటే ఫిక్స్ అయిపోవాలి అంతే…

 

సమంతా తో పని చేస్తే అదే తేడా…

సమంతా తను చేసే పనిని చాలా సీరియస్ గా తీసుకుంటుంది.  సెట్ లో అందరితో జోవియల్ గా ఉండటం, కలిసిపోవడం లాంటివి పక్కన పెడితే, ఒక సీన్ ని తను సీరియస్ గా తీసుకునే ప్రాసెస్ ని చూస్తే ఎవరికైనా కాంపిటీటివ్ స్పిరిట్ వచ్చేస్తుంది, తనకన్నా బాగా చేయాలి అనే ఆలోచన వచ్చేస్తుంది…

దేవి శ్రీ ప్రసాద్ గురించి…

ఇళయరాజా, మణిశర్మ లాంటి కంపోజర్స్ తరవాతా మళ్ళీ అంత సోల్ ఫుల్ మ్యూజిక్ చేయగలిగేది ఒక్క దేవి మాత్రమే. రంగస్థలం లో ఇంకో సాంగ్ ఉంది అది మేం రిలీజ్ చేయలేదు. అది కూడా అద్భుతంగా వచ్చింది.

చిట్టిబాబు క్యారెక్టర్…

చిట్టిబాబు చాలా జెన్యూన్ గా ఉంటాడు. ప్రతి చిన్న విషయాన్ని అద్భుతంగా ఫీల్ అవుతుంటాడు. అలాగే కోపంగా బండగా, మొరటుగా బిహేవ్ చేస్తుంటాడు…

సినిమాకి బ్యాక్ బోన్స్ వాళ్ళే…

ప్రకాష్ రాజ్ గారు, జగపతిబాబు గారు ఇద్దరు ‘రంగస్థలం’ సినిమాకి బ్యాక్ బోన్స్ లాంటి వాళ్ళు. జగపతి బాబు గారు అయితే టెర్రిఫయింగ్ క్యారెక్టర్. ఆయన యాస గాని, క్యారెక్టర్ గాని, లుక్స్ గాని సినిమాకి పెద్ద ఎసెట్. ప్రకాష్ రాజ్ గారు చాలా అద్భుతంగా ఉంటారీ సినిమాలో…

 

రంగమ్మత్తా.. అనసూయ గురించి…

అనసూయ ఏజ్ కి, సినిమాలో తను ప్లే చేసిన క్యారెక్టర్ కి అసలు సంబంధం లేదు. కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో.  చాలా అద్భుతంగా నటించింది కూడా…

100 కోట్ల క్లబ్ లోకి…

అలాంటి హైట్స్ రీచ్ అవ్వాలి అని నేను పర్సనల్ గా టార్గెట్ పెట్టుకోను కానీ, నిజంగా ఆ రేంజ్ లో కలెక్ట్ చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అటు ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూటర్స్, ఇండస్ట్రీ లాభపడుతుంది కాబట్టి వస్తే మంచిదే…

మైత్రి మూవీ మేకర్స్…

‘రంగస్థలం’ సినిమాని కాసేపు పక్కన పెడితే ఈ సినిమా చేస్తున్నంత కాలం దాదాపు 11 నెలల పాటు 600 మంది జూనియర్ ఆర్టిస్టులను వాళ్ళు పోషించారు. కేర్ తీసుకున్నారు. ఈ సిన్మా ద్వారా చాలా పుణ్యం చేసుకున్నారు. ఇక సినిమా విషయంలో ఎక్కడా ఖర్చుకు తగ్గకుండా సుక్కు విజన్ ని నమ్మి చాలా ఖర్చు పెట్టారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్…