సైరాలో అమితాబ్ లుక్ ఇదే

Tuesday,March 27,2018 - 03:22 by Z_CLU

బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైరా సెట్స్ పైకి వచ్చేశారు. అంతేకాదు.. ఆయన లుక్ కూడా లీక్ అయింది. చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సైరాలో బిగ్ బి లుక్ ఇదేనంటూ ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కథ ప్రకారం సైరా సినిమాలో చిరంజీవికి గురువుగా కనిపించనున్నారు అమితాబ్. ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. సినిమాలో ఓ పోర్షన్ లో మాత్రమే కనిపించే పాత్ర. పైగా మూవీకి చాలా కీలకమైన క్యారెక్టర్. అందుకే ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు అమితాబ్.

హీరోయిన్ నయనతార ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేసింది. జగపతి బాబు-నయనతార, మెగాస్టార్-నయనతార కాంబినేేషన్ లో సన్నివేశాలు తీస్తున్నారు. తాజాగా ఇప్పుడు బిగ్ బి కూడా సెట్స్ పైకి రావడంతో సైరా షూటింగ్ ఊపందుకుంది.

ఇక ఈ సినిమాకు సంగీతం అందించే మ్యూజిక్ డైరక్టర్ ఎవరనే విషయం కూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. రెహ్మాన్ తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అమిత్ త్రివేదిని తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.