'మహానటి'లో మరో మేజిక్

Tuesday,March 27,2018 - 04:30 by Z_CLU

మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది మహానటి సినిమా. కీర్తిసురేష్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అలనాటి మాయబజార్ లోని వివాహ భోజనంబు సాంగ్ ను రీక్రియేట్ చేస్తున్నారు ఈ సినిమాలో. సినిమాలో ఉన్న ఎన్నో ఎట్రాక్షన్స్ కు ఇప్పుడు మరో ఎట్రాక్షన్ తోడైంది. అదే దుల్కర్ సల్మాన్ డబ్బింగ్..

మహానటి సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను పోషించాడు దుల్కర్ సల్మాన్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అవ్వడమే కాదు, ఆల్రెడీ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాడు.

స్వతహాగా మలయాళీ అయిన దుల్కర్ కు తమిళ్ కొద్దిగా వచ్చు. తెలుగు మాత్రం అస్సలు రాదు. కానీ కష్టపడి తెలుగు నేర్చుకొని మరీ మహానటిలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. మే 9న థియేటర్లలోకి రానుంది మహానటి సినిమా.