సింపుల్ గా నమిత పెళ్లి

Friday,November 24,2017 - 01:07 by Z_CLU

ఈరోజు ఉదయం తిరుపతిలోని ఇస్కాన్ లో నమిత పెళ్లి సింపుల్ గా జరిగింది. సరిగ్గా ఉదయం 5 గంటల 30 నిమిషాలకు చిరకాల మిత్రుడు వీరేంద్ర, నమిత మెడలో మూడు ముళ్లు వేశాడు. సంప్రదాయబద్దంగా, సింపుల్ గా జరిగిన ఈ పెళ్లికి కోలీవుడ్ కు చెందిన టీవీ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇస్కాన్ లో సంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాధిక, శరత్ కుమార్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కేవలం ఈ వివాహంలో పాల్గొనేందుకు చెన్నై నుంచి తిరుపతి వచ్చారు రాధికాశరత్ కుమార్. వీళ్లతో పాటు కోలీవుడ్ కు చెందిన నమితకు క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు ఈ వివాహానికి హాజరయ్యారు.

సంప్రదాయ పట్టుచీరలో నమిత, కలర్ ఫుల్ షేర్వాణీలో వీరేంద్ర చూడముచ్చటగా తయారయ్యారు. వేదమంత్రాల మధ్య హిందు సంప్రదాయ పద్ధతిలో నమిత-వీరేంద్రల వివాహం జరిగింది.

త్వరలోనే చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో కోలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేసింది ఈ జంట. అయితే రిసెప్షన్ కంటే ముందు వీళ్లిద్దరూ గుజరాత్ వెళ్తారు. నమిత బంధువులు చాలామంది గుజరాత్ లోనే ఉన్నారు. వాళ్లలో చాలామంది తిరుపతిలో జరిగిన పెళ్లికి రాలేకపోయారు. అక్కడ చిన్నపార్టీ ఇచ్చిన తర్వాత, చెన్నైలో రిసెప్షన్ ఉంటుంది.

పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వనుంది నమిత. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకేఒక్క తమిళ సినిమా ఉంది. ఆ మూవీని కూడా కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ప్రారంభించనుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని ఇప్పటికే నమిత ప్రకటించింది.