సుధీర్‌బాబు, ఇంద్ర‌గంటి కాంబినేషన్ లో సినిమా ప్రారంభం

Friday,November 24,2017 - 11:24 by Z_CLU

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన `జెంటిల్‌మేన్‌` ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. మ‌ణిర‌త్నం `చెలియా` సినిమాలో నాయిక‌గా న‌టించి అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో హీరోయిన్. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్-10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.

డిసెంబ‌ర్ 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారు. మార్చి ఎండింగ్ కు షూటింగ్ పూర్తిచేసి, మే నెలలో సినిమాను విడుద‌ల చేయాలనేది ప్లాన్. హైద‌రాబాద్‌, హిమాచ‌ల్‌ప్ర‌సాద్‌, ముంబైలోని స‌రికొత్త లొకేష‌న్ల‌లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు.

నటీనటులు – సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రోహిణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు
మేక‌ప్‌: పి.బాబు,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఎన్‌. మ‌నోజ్ కుమార్‌,
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: చ‌ంద్ర‌మోహ‌న్‌,
కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌,
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌;
డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా,
సంగీతం: వివేక్ సాగ‌ర్‌,
నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.