'ఉప్పెన' సక్సెస్ సెలెబ్రేషన్స్ గెస్ట్ ఎవరంటే ?

Monday,February 15,2021 - 02:21 by Z_CLU

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన‘ సినిమా మంచి వసూళ్ళు రాబడుతూ గ్రాండ్ సక్సెస్ దిశగా వెళ్తుంది. మూడు రోజులకు గానూ దాదాపు ముప్పై కోట్ల షేర్ రాబట్టి 50 కోట్ల గ్రాస్ కి చేరువవుతుంది. సినిమా ఘన విజయం సాధించడంతో రెండు మూడు రోజుల్లో గ్రాండ్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ramcharan-appreciates-uppena-team-zeecinemalu1

రాజమండ్రిలో గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడని సమాచారం. ఇటివలే సినిమా చూసి ఇంటికి పిలిచి డైరెక్టర్ బుచ్చి బాబు , నిర్మాతలు నవీన్ , రవి లను అభినందించిన చరణ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి విచ్చేసి సినిమా గురించి మాట్లాడతానని అన్నాడట. అతిత్వరలోనే ప్లేస్ టైం డీటెయిల్స్ తో మేకర్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్ గురించి తెలియజేయనున్నారు. ఈ ఈవెంట్ కి చరణ్ తో పాటు మిగతా మెగా హీరోలు కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.

Also Read ‘ఉప్పెన’ డే1 కలెక్షన్స్