మైత్రి మూవీ మేకర్స్ @ రెండు సినిమాలు !

Monday,February 15,2021 - 03:01 by Z_CLU

‘ఉప్పెన’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తాజాగా మరో రెండు సినిమాలు మొదలయ్యాయి. కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో సినిమాను తెరకెక్కించబోతున్న మైత్రి నిర్మాతలు ఆ సినిమాతో పాటు నాని -వివేక్ ఆత్రేయ కాంబో సినిమాను కూడా ఈరోజు ఆఫీస్ లో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు.

mythri-movie-makers-has-launched-two-films-today-kalyanram-nani-zeecinemalu

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న కళ్యాణ్ రామ్ -రాజేంద్ర కాంబినేషన్ సినిమా, నాని ‘అంటే సుందరానికి’  మార్చ్ నుండి షూటింగ్ జరుపుకోనున్నాయి.

ప్రస్తుతం నిర్మాతలు నవీన్ , రవి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై  మహేష్ బాబు తో ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మెగా స్టార్- బాబీ కాంబో సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ -హరీష్ కాంబో సినిమాను నిర్మించనున్నారు.  ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ సినిమాలు లైనప్ లో ఉన్నాయి.