ZeeCinemalu - Feb 15

Sunday,February 14,2021 - 09:35 by Z_CLU

akhil-movie-zeecinemalu

అఖిల్
నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్
డైరెక్టర్ : V.V.వినాయక్
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్
రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015
అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

====================

Ninne-Istapaddanu-నిన్నే-ఇష్టపడ్డాను-Zeecinemalu

నిన్నే ఇష్టపడ్డాను
నటీనటులు – తరుణ్, అనిత, శ్రీదేవి, రాజీవ్ కనకాల, శరత్ బాబు, బ్రహ్మానందం, గిరిబాబు
దర్శకుడు – కొండ
డైలాగ్స్ – కోన వెంకట్
బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్
నిర్మాత – కేఎల్ నారాయణ
సంగీతం – ఆర్పీ పట్నాయక్
రిలీజ్ – జూన్ 12, 2003
వైజాగ్ లో ఉండే చెర్రీ (తరుణ్) సరదాగా ఉండే ఓ కాలేజ్ స్టూడెంట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన సంజన(అనిత), చరణ్ కాలేజ్ లో చేరుతుంది. ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు, ఆట పట్టించుకోవడాలు జరుగుతుంటాయి. దీంతో చరణ్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావించిన
సంజన, అతడ్ని ప్రేమించినట్టు నాటకం ఆడుతుంది. పెళ్లి వరకు తీసుకొచ్చి హైదరాబాద్ చెక్కేస్తుంది.
భగ్నప్రేమికుడిగా మారిన చెర్రీ, సంజన కోసం హైదరాబాద్ వెళ్తాడు. సంజన తనను మోసం చేసిందని తెలుకుంటాడు. సంజనకు కాబోయే భర్త బోనీ (రాజీవ్ కనకాల) సహాయంతో ఆమె ఇంట్లోకి ఎంటరైన చరణ్.. సంజనకు ఎలా బుద్ధిచెప్పాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి గీత
(శ్రీదేవి)కు ఎలా దగ్గరయ్యాడనేది ఈ సినిమా కథ.
ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా ఇందులో ఐటెంసాంగ్ చేసింది.

========================

dangal-zeecinemalu

దంగల్
నటీనటులు : ఆమీర్ ఖాన్, సాక్షి తన్వర్, ఫాతిమా సన షేక్, జైరా వసీం, సాన్య మల్హోత్రా తదితరులు
డైరెక్టర్ : ప్రీతమ్
డైరెక్టర్ : నితేష్ తివారి
ప్రొడ్యూసర్ : అమీర్ ఖాన్, కిరణ్ రావ్, సిద్ధార్థ్ రాయ్ కపూర్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 21, 2016
తన లైఫ్ లో గోల్డ్ మెడల్ సాధించలేదని దిగులుగా ఉన్నా, తన కూతుళ్ళను ప్రపంచం గుర్తించే స్థాయిలో బాక్సింగ్ చాంపియన్ చేసే ఒక తండ్రి కథే దంగల్. కథ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.

=========================

muttu-zee-cinemalu-569x320

ముత్తు
నటీనటులు : రజినీకాంత్, మీనా
ఇతర నటీనటులు : రఘువరన్, శరత్ బాబు, జయ భారతి, వడివేలు, కాంతిమతి, రాధా రవి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్
డైరెక్టర్ : K.S. రవికుమార్
ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్
రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తు, అతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

======================

Sikandar-zeecinemalu

సికిందర్
నటీనటులు : సూర్య, సమంతా రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుత్ జమ్వాల్, సూరి, బ్రహ్మానందం, మనోజ్ బాజ్ పాయ్, దళిప్ తాహిల్, మురళి శర్మ, ఆసిఫ్ బస్రా మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : N. లింగుస్వామి
ప్రొడ్యూసర్ : సిద్ధార్థ్ రాయ్ కపూర్, N. సుభాష్ చంద్రబోస్
రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2014
సూర్య హీరోగా నటించిన సికందర్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. డ్యూయల్ రోల్ లో నటించిన సూర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.