పెళ్లి చేసుకున్న బాలీవుడ్ బాంబ్ షెల్

Tuesday,August 06,2019 - 01:53 by Z_CLU

బాలీవుడ్ లో ఐటెంసాంగ్స్ తో పాటు వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన బ్యూటీ రాఖీ సావంత్. చాన్నాళ్లుగా ఈమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో నలుగుతూనే ఉన్నాయి. ఆ ముహూర్తం రానే వచ్చింది. 40 ఏళ్ల రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంది. తను పెళ్లి చేసుకున్నాననే విషయాన్ని ఈమె స్వయంగా వెల్లడించింది.

లండన్ కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త రితేష్ ను రాఖీసావంత్ పెళ్లి చేసుకుంది. లండన్ లోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ లో వీళ్ల పెళ్లి జరిగింది. అంతకంటే ముందు లండన్ లోని లోకల్ కోర్టులో వీళ్లు తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు కూడా.

దాదాపు 3 రోజులుగా తన హనీమూన్ ఫొటోల్ని షేర్ చేస్తోంది రాఖీసావంత్. అప్పుడే నెటిజన్లకు డౌట్ వచ్చింది. అలా ఊరిస్తూ వచ్చిన రాఖీసావంత్.. ఈరోజు తన పెళ్లి ఫొటోల్ని పోస్ట్ చేసింది.