రాజ్ తరుణ్ సినిమాకు టైటిల్ ఫిక్స్  !

Tuesday,September 10,2019 - 12:12 by Z_CLU

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘ఒరేయ్.. బుజ్జిగా’ టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు.

శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ‘ప్రొడక్షన్ నెం 8’ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుండి శరవేగంగా జరగనుంది.   రాజ్ తరుణ్ సరసన  మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో  వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య  పాత్రలు  పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.