సెట్స్ పైకి రానున్న మరో బిగ్గెస్ట్ బయోపిక్

Tuesday,September 10,2019 - 02:26 by Z_CLU

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ తెరకెక్కనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో పృథ్వీ రాజ్ చౌహాన్ గా కనిపించనున్నాడు అక్షయ్ కుమార్.

చరిత్రలో మొహమ్మద్ ఘోరీతో తలపడ్డ రాజుగా పృథ్వీరాజ్ చౌహాన్ కి గొప్ప స్థానం ఉంది. అలాంటి మహావీరుని కథని ప్రెజెంట్ ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా ద్వారా పృథ్వీరాజ్ చౌహాన్ కి సంబంధించి తెలియని మరెన్నో విషయాలను స్క్రీన్ పై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాకి ‘పృథ్వీరాజ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న మేకర్స్ టైటిల్ టీజర్ తో సినిమాని అనౌన్స్ చేశారు.

డా. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. త్వరలో సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్న మేకర్స్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.