మరోసారి మహేష్ సరసన మిల్కీ బ్యూటీ

Tuesday,September 10,2019 - 11:37 by Z_CLU

వీళ్లిద్దరూ కలిసి ఇంతకుముందు ఆగడు సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది తమన్న. అవును.. సరిలేరు నీకెవ్వరు సినిమాలోకి తమన్నాను తీసుకున్నారు.

నిజానికి ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. మరి తమన్నకు చోటు ఎక్కడిది. నిజమే.. ఇందులో తమన్న హీరోయిన్ కాదు, మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆమె కనిపిస్తుందట. ఎఫ్-2లో తమన్నతో కలిసి వర్క్ చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా ఆమెను మరోసారి రిపీట్ చేస్తున్నాడు.

తమన్నకు స్పెషల్ సాంగ్స్ కొత్తకాదు. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది. జాగ్వార్, స్పీడున్నోడు, జై లవకుశ సినిమాల్లో తమన్న స్పెషల్ సాంగ్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ ట్రాక్ రికార్డ్ చూసే ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. కొండారెడ్డి బురుజు సెట్ ను ప్రత్యేకంగా వేశారు. ఆ సెట్ లోనే మహేష్-రష్మికపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.