ఆరు పాటలు... ఐదుగురు సంగీత దర్శకులు

Monday,June 25,2018 - 06:40 by Z_CLU

రాజ్ తరుణ్ , రిద్ది కుమార్ జంటగా అనిష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘లవర్’ సినిమా ఆడియో విడుదలైంది. ఈ సినిమా కోసం ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేయడం విశేషం. టైటిల్ కి తగ్గట్టే యూత్ ఫుల్ ఆల్బమ్ గా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ‘లవర్’ ఆల్బమ్. ఆడియోపై ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

“నాలో చిలిపి కల” అంటూ సాగే ఈ సాంగ్ ఆల్బమ్ లో మెయిన్ హైలైట్ గా నిలుస్తూ మ్యూజిక్ లవర్స్ అందరికి ఫేవరేట్ అయిపొయింది. ఈ సాంగ్ కి సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి లిరిక్స్ అందించాడు. పాపులర్ సింగర్ యాజిన్ నిజార్ పాడాడు. మొదట ఈ సాంగ్ ఆల్బం లో లేదు… సినిమా కోసం సాయి కార్తీక్ ఒక బీజీఎం కంపోజ్ చేసి దిల్ రాజుకి వినిపించగా…. దిల్ రాజుతో సహా టీం అందరికీ నచ్చడంతో బిట్ మ్యూజిక్ ను కాస్తా ట్యూన్ గా మార్చి సాంగ్ కంపోజ్ చేసాడట సాయి కార్తీక్. ట్యూన్ తో పాటే క్యారీ అయ్యే లిరిక్స్ ఈ సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్.

 

‘వాట్ ఎ అమ్మాయి’ అంటూ తన ప్రేయసి చరిత అందం గురించి రాజ్ పాడే సాంగ్ ఇది. ఒక అందమైన అమ్మాయి మొదటి చూపులోనే తన మనసు దోచుకుంటే ఆ యువకుడి ఊహలో ఆ అమ్మాయి ఓ అద్భుతంలా కనిపిస్తుంది. ఆ కుర్రాడి భావాన్ని సరిగ్గా పదాలుగా సమకూర్చి ఈ పాట కి సాహిత్యం అందించాడు శ్రీమణి. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అర్కో మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను తన గొంతుతో మరింత హైలైట్ చేసాడు సోను నిగం. ఈ సాంగ్ కి తన ఇన్స్ ట్రుమెంట్స్ తో సరికొత్త సౌండింగ్ ఇచ్చాడు అర్కో.

హీరో హీరోయిన్స్ ఇద్దరూ అనుకోకుండా కేరళ వెళ్తారు. ఆ సందర్భంలో కేరళ నేటివిటీ ను చూపిస్తూ వచ్చే సాంగ్ ‘అద్భుతం’. ఈ సినిమాకు  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఓ వ్యక్తి దర్శకుడు అనిష్ కి ఈ పదం చెప్తే… ఆ పదాన్ని శ్రీ మణి కి చెప్పి ఈ సాంగ్ రాయించాడు దిల్ రాజు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ భాగ్చి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను జుబిన్, రజిని పాడారు.

ఆల్మోస్ట్ ప్రతీ ఆల్బంలో ఉండే హీరో ఎంట్రీ సాంగ్ ఈ ఆల్బం లో కూడా ఉంది. ‘రాముని బాణంలా’ అనే పల్లవితో స్టార్ట్ అయ్యే ఈ సాంగ్…. ఆల్బం రిలీజ్ కి ముందే అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ‘లవర్ తో టాకింగ్ కై ఫోనే కనిపెట్టి హీరో అయ్యాడు గ్రాహంబెల్..ఆపిల్ తో సరదాగా చాటింగ్ చేపట్టి న్యూటన్ అయ్యాడు ఎగ్జాంపుల్’ అంటూ వచ్చే లిరిక్స్ సాంగ్ లోని మీనింగ్ తెలియజేస్తూ ఆల్బం లో ఓ మంచి సాంగ్ గా నిలుస్తుంది. ఈ సాంగ్ కి రిషి రిచ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి లిరిక్స్ అందించాడు.

‘అన్నావు ఏదో మువ్వలా ఆ మాట’ అనే పల్లవి తో వచ్చే ఈ సాంగ్ తన ప్రేమను పట్టించుకోని అమ్మాయి పాజిటీవ్ గా స్పందించిన స్విచ్చు వేషన్ లో వచ్చే సాంగ్ అని అర్ధమవుతుంది. ‘అంతే కదా మరి’ అంటూ సాగే ఈ సాంగ్ ను అంకిత్ తివారి కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. ప్రేమలో పడిన అబ్బాయి, అమ్మాయిల ఆనందం ఇలా ఉంటుందంటూ ట్యూన్ కి పర్ఫెక్ట్ లిరిక్స్ అందించాడు సిరివెన్నెల. సింగర్ జోనితా గాంధీ తో కలిసి అంకిత్ తివారి ఈ పాటను పాడాడు.

ఈ ఆల్బంలో మరో స్పెషల్ సాంగ్ ‘ఏవైపుగా సాగాలి’… లిరిక్స్ ని బట్టీ చూస్తే ఈ సాంగ్ చరిత -రాజ్ దూరమైన సందర్భంలో వచ్చే బ్రేకప్ సాంగ్ అని అర్ధమవుతుంది. తను గొప్పగా ప్రేమించే అమ్మాయి దూరమైన సందర్భంలో ఓ ప్రేమికుడు పడే బాధను తన సాహిత్యంతో ఎంతో అందంగా చెప్పాడు శ్రీమణి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ సాంగ్ ను తనే కంపోజ్ చేసి స్వయంగా పాడాడు అంకిత్ తివారి.

ఫైనల్ గా కంప్లీట్ యూత్ ఫుల్ ఆల్బం గా ‘లవర్’ మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకోవడం ఖాయం.