NagaShaurya - మరో మూవీ సెట్స్ పైకి!

Thursday,July 15,2021 - 03:09 by Z_CLU

ఇప్పటికే లక్ష్య, వరుడు కావలెను సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు నాగశౌర్య. ఆ రెండు సినిమాల షూటింగ్స్ ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. ఇప్పుడు మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు. తన సొంత బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శౌర్య. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా కూడా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది.

ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గతంలోనే మొదలైంది. తాజాగా కొత్త షెడ్యూల్ నడుస్తోంది. హీరో నాగశౌర్య, హీరోయిన్‌ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Naga Shaurya Anish Krishna Film Shoot zeecinemalu

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ టైటిల్‌ ను త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో సీనియర్‌ యాక్టర్‌ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్యనటులు ‘వెన్నెల’ కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండ‌బోతోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics