NTR బయోపిక్ లో చంద్రబాబు ఎవరో తెలుసా...?

Monday,June 25,2018 - 07:15 by Z_CLU

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది NTR బయోపిక్. ప్రస్తుతానికి క్రిష్ & టీమ్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ ని వీలైనంత త్వరలో కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అయితే NTR లైఫ్ లోని మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేస్తూ తెరకెక్కనున్న ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు  రోల్ లో కనిపించబోయే స్టార్ చుట్టూ, 2 తెలుగు స్టేట్స్ లోను భారీ స్థాయిలో క్యూరియాసిటీ రేజ్ అవుతుంది.

బాలయ్య NTR రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో NTR సినిమా కరియర్ తో పాటు, పొలిటికల్ కరియర్ గురించి ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని ఎలివేట్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే NTR పొలిటికల్ కరియర్ లో కీ రోల్ ప్లే చేసిన చంద్రబాబు రోల్ లో రానా కనిపించనున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

 

ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు కానీ, ఈ రోల్ కి రానా అయితేనే పర్ఫెక్ట్ అనే టాక్ సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. మరి సినిమా యూనిట్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.