రాజమౌళి RRR – ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

Friday,December 07,2018 - 10:03 by Z_CLU

ఫస్ట్ షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని ప్లాన్ చేసుకున్నాడు జక్కన్న. సినిమా సెట్స్ పైకి వచ్చింది మొదలు నిన్నటి వరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న RRR టీమ్, సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది. ఈ షెడ్యూల్ లో తెరకెక్కించిన యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాలోని కీలక సందర్భంలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 

 

ఇక నెక్స్ట్ షెడ్యూల్ డీటేల్స్ అయితే  ప్రస్తుతానికి  బయటికి రాలేదు కానీ, ఈ షెడ్యూల్ లో నాన్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ ని ఏ లొకేషన్ లో ప్లాన్ చేస్తారా అని తెలియాల్సి ఉంది. ఈ గ్యాప్ లో ఈ సినిమాలో చెర్రీ, NTR సరసన హీరోయిన్స్ గా ఎవరు ఫిక్సయ్యారనే డీటేల్స్ కూడా రివీల్ చేసే చాన్సెస్ ఉన్నాయి.

 

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి D.V.V. దానయ్య ప్రొడ్యూసర్. కీరవాణి మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమా 2020 లో రిలీజవుతుంది.