RRR రిలీజ్ ఎప్పుడో చెప్పలేను

Tuesday,April 21,2020 - 01:00 by Z_CLU

రాజమౌళి మరో బాంబ్ పేల్చాడు. ఇప్పటికే ఓసారి ఆర్ఆర్ఆర్ రిలీజ్ ను వాయిదా వేసిన ఈ దర్శకుడు.. తాజాగా ప్రకటించిన కొత్త రిలీజ్ డేట్ పై కూడా అనుమానాలు వ్యక్తంచేశాడు. ఏమో చెప్పిన తేదీకి వస్తామో రామో చెప్పలేం… ఆ ఒత్తిడి నాపై చాలా ఎక్కువగా ఉందంటూ స్పందించాడు.

ఆర్ఆర్ఆర్ ను ముందుగా ఈ ఏడాది జులై 31న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షెడ్యూల్స్ లేట్ అవ్వడంతో సినిమాను ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. 2021 జనవరి 8న వస్తామంటూ ప్రకటించారు. ఇప్పుడా తేదీకి కూడా అనుమానమే అంటున్నాడు రాజమౌళి. కరోనా వల్ల షెడ్యూల్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయాయని, కాబట్టి చెప్పిన తేదీకి వస్తామో రామో అప్పుడే చెప్పలేం అంటున్నాడు.

సినిమా షూటింగ్ ఇంకా 20శాతం పెండింగ్ ఉందంటున్నాడు జక్కన్న. 20శాతమంటే చూడ్డానికి తక్కువగానే ఉన్నప్పటికీ.. ఇలాంటి పెద్ద సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్, షూట్ అన్నీ మిక్స్ అయి ఉంటాయని.. ఎప్పటికప్పుడు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంటుందని అంటున్నాడు.

మరోవైపు అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో జరుగుతున్న గ్రాఫిక్ వర్క్ లు కూడా ఆగిపోవడంతో రిలీజ్ డేట్ పై తను ఇప్పటికిప్పుడు స్పందించలేనని క్లారిటీ ఇచ్చాడు.