కరోనాపై ఆర్జీవీ సినిమా

Tuesday,April 21,2020 - 12:02 by Z_CLU

వివాదాస్పద అంశాలు, బర్నింగ్ ఇష్యూస్ ఎక్కడుంటే వర్మ అక్కడుంటాడు. వాటిపైనే సినిమాలు తీయడానికి ఇష్టపడతాడు. ఇప్పుడీ దర్శకుడు కరోనాను కూడా వదల్లేదు. అవును.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై సినిమా తీస్తానని ప్రకటించాడు ఆర్జీవీ.

అక్కడితే ఆగితే అతడు వర్మ ఎందుకవుతాడు.. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని కూడా ప్రకటించి సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు. ఓ ఛానెల్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టిన వర్మ.. లాక్ డౌన్ నుంచి ఇండస్ట్రీ కోలుకున్న వెంటనే సినిమాను ఎనౌన్స్ చేస్తానని ప్రకటించాడు.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా అనేది డౌట్. ఎందుకంటే.. వర్మ ఇప్పటికే చాలా సినిమాలు ప్రకటించాడు. కొన్ని సినిమాలైతే టైటిల్స్ తో పాటు ఎనౌన్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ చాలామటుకు తెరపైకి రాలేదు. సో.. కరోనా సినిమా వస్తుందా రాదా అనేది అప్పుడే చెప్పలేం. ఇంతకంటే మంచి బర్నింగ్ లేదా కాంట్రవర్సీ సబ్జెక్ట్ దొరికితే ఆటోమేటిగ్గా అటు షిఫ్ట్ అయిపోతాడు వర్మ.