ఒక్క RRR విషయంలోనే ఎందుకిలా..?

Monday,March 04,2019 - 02:02 by Z_CLU

RRR సెకండ్ షెడ్యూల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కానుంది. రాజమౌళి తనకు చాలా ఇష్టమైన యాక్షన్ సీక్వెన్సెస్ నే ముందుగా కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ లో కూడా NTR, రామ్ చరణ్ కాంబినేషన్ లో  ఉండే ఫైట్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించి, కార్తికేయ పెళ్ళి కోసమని బ్రేక్ తీసుకున్నాడు. ఆ తరవాత ఇమ్మీడియట్ గా సెకండ్ షెడ్యూల్ బిగిన్ చేసిన జక్కన్న ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ పైనే ఫోకస్ పెట్టాడు. అదంతా ఓకె…. కానీ ఈ సినిమాలో NTR, చెర్రీ సరసన జోడీ కట్టనున్న హీరోయిన్స్ సంగతేంటి…?

ఒక్క హీరోయిన్స్ విషయంలోనే కాదు ఈ సారి రాజమౌళి  ప్రతి విషయంలోనూ సీక్రెట్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో వీళ్ళిద్దరితో  సినిమా అని, ఓ ఫోటో రిలీజ్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక సెట్స్ పైకి వచ్చాక ఆన్ లొకేషన్ మరో ఫోటో రివీల్ చేశాడు. అంతకు మించి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అన్  అఫీషియలే. ఎందుకలా…?

 

సాధారణంగా రాజమౌళి తన సినిమా గురించి ఎప్పుడూ ఇంత సీక్రెట్ మెయిన్ టైన్  చేయలేదు. సినిమా సెట్స్ పైనే ఉంటుంది స్టోరీ కూడా రివీల్ చేసేస్తాడు. అలాంటిది ఈ సారి కనీసం మీడియా ఇంటరాక్షన్ కూడా లేకుండా,  సైలెంట్ గా ఉండటం వల్ల ఈ సినిమా చుట్టూ డిఫెరెంట్  స్పెక్యులేషన్స్  క్రియేట్ అవుతున్నాయి.

ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా ఫిక్సయిందనే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఆలియా భట్ ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసిందనే టాక్ కూడా ఉంది. ఇంతకీ ఇదంతా కరెక్టే నా..? అసలు RRR లో విలన్ ఎవరు..? కనీసం ఆ వివరాలు రిలీజ్ చేసినా ఫ్యాన్స్ కి కాస్త ఊరటగా ఉండేది. విలన్ ఎవరో తెలీకపోయేసరికి, NTR ఈ సినిమాలో బందిపోటు నాయకుడని, వీళ్ళిద్దరికీ మధ్య జరిగే ఘర్షణే సినిమా అని సొంత స్క్రిప్ట్ రాసేసుకుంటున్నారు. రేపో మాపో సెకండ్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పనున్న మేకర్స్, అప్పుడైనా ఈ సినిమాకి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రివీల్ చేస్తారో లేదో చూడాలి.