ఇప్పుడు ముగ్గురు దర్శకులయ్యారు...

Friday,June 14,2019 - 11:03 by Z_CLU

ఒకప్పుడు భారీ సినిమాల దర్శకుడు అంటే రాజమౌళి ఒక్కడే…. సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు.. అని ప్రకటించింది మొట్ట మొదట రాజమౌళి సినిమాకే. అయితే ఈ వరసలో చిన్నగా మరింత మంది దర్శకులు చేరుతున్నారు. ‘సైరా’ తో సురేందర్ రెడ్డి… ‘సాహో’ తో సుజిత్ కలిసి మొత్తానికి ముగ్గురు దర్శకులయ్యారు.

సినిమాకి బడ్జెట్ పెట్టడం పెద్ద విషయం కాదు… కానీ ఆ సినిమాని వరల్డ్ కాన్వాస్ పై ప్రెజెంట్ చేయగలిగే స్టాండర్డ్స్ ని క్రియేట్ చేయడమే ఇక్కడ చాలెంజ్. ‘బాహుబలి’ విషయంలో రాజమౌళి అద్భుతమైన స్ట్రాటజీ వాడాడు… అప్పటి వరకు మహా అయితే ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజైతేనే గొప్ప అనుకుంటే.. ‘బాహుబలి’ తీసి ఏకంగా ప్రపంచం ముందు పెట్టేశాడు. ఇండియన్ సినిమా వైపు ఒక్కసారిగా తిరిగి చూసేలా చేశాడు.

ఈ రివొల్యూషన్ ఇండియన్ ఫిలిమ్ మేకర్స్ మీద.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా దర్శకుల మధ్య భారీగానే పడింది. బాహుబలి సక్సెస్ అయి ఉండకపోతే, సైరా, సాహో సినిమాలు వచ్చేవి కావా..? అంటే డెఫ్ఫినెట్ గా వచ్చేవి. కానీ టార్గెట్ వరల్డ్ కాన్వాస్ అయ్యేదా..? ఖచ్చితంగా అనుమానమే…!!

సంవత్సరాల తరబడి శ్రమ…. రిస్క్ అనిపించే స్థాయి బడ్జెట్.. అన్నింటికీ మించి స్టాండర్డ్స్ ని సెట్ చేయాల్సిందే అన్న ఆలోచన… టాలీవుడ్ లో పెద్ద సినిమా దర్శకుల అంకెని పెంచేస్తుంది… ఇప్పుడు వీళ్ళు ముగ్గురే… వీరి తరవాత చేరనున్న నాలుగో దర్శకుడు ఎవరో చూడాలి మరీ…