టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్

Saturday,June 15,2019 - 10:03 by Z_CLU

చాలా మంది డైరెక్టర్స్ వస్తుంటారు పోతుంటారు… అందులో కొందరు న్యూట్రల్ గా ఉంటూ ప్లాన్డ్ గా కరియర్ ని ప్లాన్ చేసుకుంటూ ఒక్కో సినిమా చేసుకుంటూ ఉంటారు… కానీ టాలీవుడ్ లో ఈ ముగ్గురు మాత్రం వేరు… వీల్ సినిమా రిలీజైతేనే సెన్సేషన్ ఉండదు. చిన్నగా ప్రెస్ మీట్ పెట్టినా, సినిమా ప్రపంచం నిలబడి చూస్తుంది… టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ రాజమౌళి… సుజిత్… సురేందర్ రెడ్డి…  వీళ్ళు కొంచెం డిఫెరెంట్…

రాజమౌళి : ‘RRR’ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి కాస్త పక్కన పెట్టేస్తే… జక్కన్న కరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ బాహుబలి… ఆయన కరియర్ లోనే కాదు.. అప్పటికీ తెలుగు సినిమా ఇంత భారీ విజువల్ వండర్ ని అసలు చూడలేదు. ఈ సినిమా చేయాలని రాజమౌళి నిర్ణయం తీసుకునే నాటికి ఆయనకు ఉన్న అనుభవం 8 సినిమాలు..

సురేందర్ రెడ్డి : మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలనేది ప్రతి దర్శకుడి కల. సురేందర్ రెడ్డి కూడా అదే కల కన్నాడు.. కాకపోతే అందరి కన్నా భారీగా విజువలైజ్ చేసుకున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక మహా పోరాట యోధుడి కథని భారీగా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ఇంత పెద్ద బాధ్యతని భుజాన వేసుకునే నాటికి సురేందర్ రెడ్డి అనుభవం కూడా 8 సినిమాలు.

సుజిత్ : యంగ్ డైరెక్టర్… కాలేజ్ లో ఉన్న రోజుల్లోనే  ప్రభాస్ సినిమాలు చూసుకుంటూ విజువలైజ్ చేసుకుని ఉంటాడు ‘సాహో…’ సినిమాని. అందుకే రాజమౌళి, సురేందర్ రెడ్డి ల్లా అంత ఓపిగ్గా కాకుండా చాలా వేగంగా బరిలోకి దిగాడు. ‘సాహో’ సినిమా కి ముందు సుజిత్ చేసింది జస్ట్ ఒకే ఒక్క సినిమా. ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి సుజిత్ కాన్ఫిడెన్స్ ఒక రీజన్ అయితే ప్రభాస్ సుజిత్ ని నమ్మడం మరో పెద్ద రీజన్.