రాజమౌళి చెప్పిన RRR సంగతులు

Friday,April 24,2020 - 12:41 by Z_CLU

“కరోనా వల్ల RRR షెడ్యూల్స్ లో మార్పులుంటాయి తప్ప, ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు చేయను. షూటింగ్స్ కు అనుమతి ఎప్పుడిస్తారో తెలీదు. దానికి తగ్గట్టు షెడ్యూల్స్ లో మార్పులు చేస్తాను. చిత్రీకరణ విధానంలో మార్పులుంటాయి. ఫైనల్ ప్రాజెక్టు మాత్రం సేమ్.”

“ఎన్టీఆర్, చరణ్ లో వ్యక్తిగతంగా ఎలాంటి మార్పుల్లేవు. నటులుగా మాత్రం ఇంతకుముందుతో పోలిస్తే బాగా మెచ్యూర్ అయ్యారు. చెప్పింది అర్థం చేసుకోవడంలో మరింత అవుట్ పుట్ ఇవ్వడంలో చాలా బెటర్ అయ్యారు. ఇద్దరితో పనిచేసి పదేళ్లు పైనే అయింది. ఈ గ్యాప్ లో వాళ్లు చాలా సినిమాలు చేశారు. చాలా ఎక్స్ పీరియన్స్ సంపాదించారు.”

“చరణ్, తారక్ ఇద్దరూ అల్లరే. కాకపోతే తారక్ చేసే అల్లరి పైకి కనిపిస్తుంది. చరణ్ పైకి కనిపించడు. అంతే తేడా. వాళ్లిద్దర్నీ ఒక పొజిషన్ లో నిల్చోబెట్టి సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్లడమనేది నాకు కష్టమైన పని. ఇద్దరూ గిల్లుకోవడం, వెక్కించుకోవడం చేస్తుంటారు. ఒకరికి ఏదో సీన్ గురించి నేను సీరియస్ గా చెబుతుంటే, ఇంకొకరు ఫన్నీగా మొహం పెడుతూ వెక్కిరిస్తుంటారు.”