చైతు కథ తో...

Saturday,December 03,2016 - 06:00 by Z_CLU

టాలీవుడ్ లో సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ మరో సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు. ప్రస్తుతం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’,’అందగాడు’ సినిమాలలో నటిస్తున్న ఈ కుర్ర హీరో త్వరలోనే మరో సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు.

raj-tarun

 రాజ్ తరుణ్ నటించనున్న ఈ సినిమాను తమిళ దర్శకురాలు రాగిణి డైరెక్ట్ చేయనుందట. గతంలో గౌతమ్ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖ లో పనిచేసిన ఈమె అప్పట్లో నాగచైతన్య కు ఓ కథ వినిపించారట. అయితే వరుస సినిమాల తో బిజీ గా ఉండడం వల్ల చైతు ఈ కథను రాజ్ తరుణ్ కి వినిపించమని సజెస్ట్ చేసాడట. ఇక రాజ్ తరుణ్ కూడా కథ నచ్చడం తో వెంటనే ఈ లేడి డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను ‘అన్నపూర్ణ స్టూడియోస్’ నిర్మించనుందని సమాచారం.