జీ సినిమాలు (డిసెంబర్ 4th)

Saturday,December 03,2016 - 08:00 by Z_CLU

manmadha_banam

నటీనటులు : కమల్ హాసన్, మాధవన్, త్రిష, సంగీత

ఇతర నటీనటులు : రమేష్ అరవింద్, ఊర్వశి, ఉషా ఊతప్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్  : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : సుబ్రహ్మణ్యం B, రూపేష్ Y

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2010

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి, కామెడీ సినిమాలకి విభిన్నంగా తెరకెక్కిన కమర్షియల్ హిల్లెరియాస్ ఎంటర్ టైనర్ మన్మధ బాణం. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అంబుజాక్షి కి, మదన్ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి నిర్ణయిస్తారు పెద్దలు. కోటీశ్వరుడైన మదన్ అంబుజా అంటే ఇష్టమే కానీ, ఎక్కడో అంబుజా కి సీక్రెట్ లవర్ ఉన్నాడనే అనుమానం త్లిచివేస్తూ ఉంటుంది. అప్పుడు మదన్ ఆ వ్సిహాం తేల్చుకోవడానికి ఓ డిటెక్టివ్ ని పెడతాడు. ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ ని కమల్ హాసన్ పోషించాడు. అంబుజా , మదన్ లుగా, త్రిష, మాధవన్ నటించారు.  అసలు కథ ఏ మలుపులు తిరిగింది..? చివరికి ఏం జరిగిందనేది ZEE Cinemalu లో చూడాల్సిందే…

——————————————————————

ganesh

నటీ నటులు : వెంకటేష్, రంభ, మధుబాల
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, చంద్ర మోహన్, కోట శ్రీనివాస్ రావు, రేవతి, అశోక్ కుమార్.
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : తిరుపతిస్వామి
నిర్మాత : రామా నాయుడు
రిలీజ్ డేట్ : 19 జూన్ 1998

‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్- గణేష్’ . ఈ డైలాగ్ కొన్ని రోజుల వరకు యూత్ నోటిలో ఊతపదంలా వినిపించేది అంత ఇంపాక్ట్ చూపించింది గణేష్ సినిమా. ఒక సాధారణ జర్నలిస్ట్ రోల్ లో అతి సహజంగా నటించాడు విక్టరీ వెంకటేష్. కరప్టెడ్ డాక్టర్స్ వల్ల తన కుటుంబంలో చోటు చేసుకున్న విషాదంతో, తిరగబడ్డ గణేష్ ఎలా సంఘ విద్రోహులను మట్టి కరిపించాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ గణేష్. మణిశర్మ సంగీతం సినిమాకి ఎసెట్.

——————————————————————

mr-nookayya

నటీ నటులు : మంచు మనోజ్, కృతి కర్బందా, సనా ఖాన్
ఇతర నటీనటులు :రాజా, బ్రహ్మానందం, మురళి శర్మ ,రఘు బాబు,పరుచూటి వెంకటేశ్వరావు ,వెన్నెల కిషోర్, ఆహుతి ప్రసాద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువ శంకర్ రాజా
డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి
నిర్మాత : డి.ఎస్.రావు
రిలీజ్ డేట్ : 8 మార్చ్ 2012

మంచు మనోజ్ సరి కొత్త ఎనర్జీ తో ఆవిష్కరించిన సినిమా ‘మిస్టర్ నూకయ్య’. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కిన  ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన పాటలు సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్, కామెడీ, పాటలు, క్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.

——————————————————————

lakshmi-putrudu

నటీ నటులు : ఉదయ్ కిరణ్, దివ్య

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముమైత్ ఖాన్, నిగళ్ గళ్ రవి, సత్య రాజ్, రఘుబాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. లక్ష్మణ్

డైరెక్టర్ : రాజ్ కపూర్

ప్రొడ్యూసర్ : పొలిశెట్టి రామ్ బాబు

రిలీజ్ డేట్ : 29 ఫిబ్రవరి 2008

ఉదయ కిరణ్ చేసిన సినిమాల్లో ప్రేమ కథలే ఎక్కువ. లవర్ బాయ్ ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న టైం లో ఫాదర్ సెంటిమెంట్ తో చేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ లక్ష్మీ పుత్రుడు. మతి స్థిమితం తప్పిన తన తండ్రి కోసం, హీరో ఏం చేశాడన్నదే ప్రధాన కథాంశం.

——————————————————————

poratam

నటీ నటులు : సూర్య, జ్యోతిక

ఇతర నటీనటులు:  రఘువరన్, శివ కుమార్, రాధిక, బాలాజీ, కణల్ కన్నన్

మ్యూజిక్ డైరెక్టర్ : దేవ

డైరెక్టర్ : K.R.జయ

ప్రొడ్యూసర్ : ముత్తం శివకుమార్

రిలీజ్ డేట్ : 29 September 2000

సూర్య, జ్యోతిక జంటగా నటించిన ‘పోరాటం’ పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇద్దరన్నాదమ్ముల మధ్య చిన్నగా మొదలైన అసూయ చివరికి ఎటు దారి తీసింది…? ఇద్దరిలో చిన్నవాడైన సూర్య ఏం చేసి అన్న ఆలోచనా విధానాన్ని మార్చాడు అన్నదే ప్రధాన కథాంశం.

——————————————————————

poola-rangadu

నటీ నటులు : అక్కినేని నాగేశ్వర రావు, జమున

ఇతర నటీనటులు : విజయ నిర్మల, చిత్తూర్ వి. నాగయ్య, గుమ్మడి, అల్లు రామలింగయ్య, శోభన్ బాబు

మ్యూజిక్ డైరెక్టర్ :  సాలూరి రాజేశ్వర రావు

డైరెక్టర్ : ఆదుర్తి సుబ్బారావు

ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు

రిలీజ్ డేట్ : 24 నవంబర్ 1967

ANR, జమున నటించిన క్లాసిక్ ఎంటర్ టైనర్ ‘Beyond This Place’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. నిజాయితీనే నమ్ముకుని బ్రతికే పూలరంగడు చేయని నేరానికి జైలు పాలైన తన తండ్రిని, నిర్దోషి అని ఎలా నిరూపించాడు అనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి సాలూరి రాజేశ్వర రావు సంగీతం అందించారు.