అదే స్పీడ్ తో....

Monday,January 23,2017 - 12:27 by Z_CLU

యంగ్ హీరో రాజ్ తరుణ్ స్పీడ్ పెంచేసాడు. ఏడాది కి రెండు సినిమాలతో థియేటర్స్ లో సందడి చేసే ఈ యంగ్ హీరో ఈ ఇయర్ మాత్రం ఓ మూడు సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో ఫిబ్రవరి 17న థియేటర్స్ లోకి రావడానికి రెడీ గా ఉన్న రాజ్ తరుణ్ మరో వైపు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘అందగాడు’ సినిమాను కూడా త్వరలోనే థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇప్పటికే దాదాపు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో సమ్మర్ లో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట .

ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ ను జెట్ స్పీడ్ తో ఫినిష్ చేసిన రాజ్ తరుణ్ అదే స్పీడ్ తో లేడి డైరెక్టర్ సంజన దర్శకత్వం లో తెరకెక్కనున్న సినిమాను ఫినిష్ చేసి ఈ ఇయర్ లోనే ఆ సినిమాను కూడా థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. అంటే లాస్ట్ ఇయర్ రెండు సినిమాలతో ఎంటర్టైన్ చేసిన రాజ్ తరుణ్ ఈ ఇయర్ ను కాస్త స్పెషల్ గా ప్లాన్ చేసుకొని మూడు సినిమాలతో ఎంటర్టైన్ చేయాలనీ డిసైడ్ అయిపోయాడన్నమాట . మరి  ఈ కుర్ర హీరో ఈ మూడు సినిమాలతో ఎలాంటి హిట్స్ సాధిస్తాడా? చూడాలి..