పవన్ NTR మధ్య బాక్సాఫీస్ వార్

Monday,January 23,2017 - 11:17 by Z_CLU

ఇంకా సినిమా సెట్స్ పైకి కూడా రాలేదు. అప్పుడే వార్ మొదలైపోయింది. అటు NTR, ఇటు పవన్ కళ్యాణ్ ఒకే డేట్ పై కన్నేశారు. అదే ఆగష్టు 11. ఈ డేట్ కి రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమాలైతే ఇంకా సెట్స్ పైకి రాలేదు కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ ని మిస్ కాకూడదని ఇద్దరి స్ట్రాంగ్ ఫీలింగ్.

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తరవాత ఇమ్మీడియట్ గా త్రివిక్రమ్ సినిమా సెట్స్ పై ఉంటాడు. రేపో మాపో NTR కూడా సెట్స్ పైకి వచ్చేస్తాడు. సినిమా ఎపుడు బిగిన్ అయినా ప్రాబ్లం లేదు కానీ, రిలీజ్ మాత్రం ఆగష్టు 11 నే చేయాలని, అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వడానికి కారణం లాంగ్ వీకెండ్ అవ్వడమే.

ఆగష్టు 11 శుక్రవారం, 12 శనివారం, ఆదివారం 13, 14 న కృష్ణాష్టమి  ఇక 15 న ఇండిపెండెన్స్ డే.. వరసగా హాలీడేస్ ఉండటంతో అదే రైట్ టైమని డిసైడ్ అయ్యారు NTR, పవన్ కళ్యాణ్. గతంలో జనతా గ్యారేజ్ రిలీజ్ కి కూడా ఇలాంటి ఫార్మూలాని ఫాలో అయ్యాడు NTR.