రెండు సినిమాతో రెడీ ....

Monday,January 02,2017 - 01:30 by Z_CLU

యంగ్ హీరో రాజ్ తరుణ్ స్పీడ్ పెంచేసాడు. 2017 దాదాపు మూడు సినిమాలతో థియేటర్స్ లో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే ‘అంధగాడు’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అనే రెండు సినిమాల షూటింగ్ ను దాదాపు పూర్తి చేసిన రాజ్ తరుణ్ త్వరలోనే లేడి డైరెక్టర్ సంజన దర్శకత్వంలో ఓ సినిమా ను సెట్స్ పైకి తీసుకు రాబోతున్నాడు.

  న్యూ ఇయర్ సందర్బంగా ఎ కె  ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న  తన  లేటెస్ట్ సినిమా ‘అంధగాడు’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా టీజర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసాడు  రాజ్ తరుణ్.  ఈ రెండు సినిమాలతో రిలీజ్ కి అవుతున్న ఈ కుర్ర హీరో లేటెస్ట్ సినిమా ల పోస్టర్స్ , టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో పాటు సంజన డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా తో కలిపి 2017 లో మూడు సినిమాలతో థియేటర్స్ లో అడుగు  పెట్టబోతున్నాడు యంగ్ హీరో…

andhagadu