దూసుకెళ్తున్న మిస్టర్

Monday,January 02,2017 - 02:30 by Z_CLU

న్యూ ఇయర్ సందర్భంగా రిలీజైన వరుణ్ తేజ్ ‘మిస్టర్’ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్. టీజర్ రిలీజైన కేవలం 24 గంటల్లో మిలియన్ వ్యూస్ ని దాటేసి, ఇంకా నంబర్స్ పెంచుకునే స్పీడ్ లోనే ఉంది.

అల్టిమేట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘మిస్టర్’ టీజర్, శ్రీను వైట్ల బ్రాండ్ మార్క్ ని ఎలివేట్ చేస్తుంది. ఏమాత్రం కాంప్లిమెంట్స్ కోసం ఏర్చి కూర్చి పెట్టిన కామెడీ, అమేజింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ అనిపించుకునే ప్రయత్నాలు చేయకుండా, జస్ట్ ఫీల్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న శ్రీను వైట్ల ఈ టీజర్ తో మ్యాగ్జిమం ఇంప్రెస్ చేసేశాడు.

సరికొత్త లొకేషన్స్ లో, సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ‘మిస్టర్’ సినిమాలో లావణ్య త్రిపాఠి తో పాటు హెబ్బా పటేల్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది.