పవన్ కళ్యాణ్ ఇలా చేయడం ఫస్ట్ టైం

Monday,January 02,2017 - 12:35 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారాణంగా ఎవరి సినిమాల గురించి పెద్దగా పట్టించుకోడు. తన సినిమాల ప్రమోషన్స్ లోనే అంతంత మాత్రంగా పార్టిసిపేట్ చేసే పవర్ స్టార్, ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ సినిమాను పొగిడాడు.

రీసెంట్ గా రిలీజైన అమీర్ ఖాన్ దంగల్ సినిమా చూసిన పవన్ కళ్యాణ్, అమీర్ ఖాన్ తో పాటు ఆ సినిమాలో నటించిన అమ్మాయిలను పేరు పేరున అభినందిస్తూనే, ఆ సినిమా చూసైనా దేశంలో ఆడవారి పట్ల తన చులకన భావాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశాడు.