రిపీట్ కానున్న కుమారి 21 F కాంబో

Thursday,December 21,2017 - 01:42 by Z_CLU

కుమారి 21 F లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత రాజ్ తరుణ్ ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ క్రేజీ కాంబో మరోసారి సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం రాజుగాడు, లవర్ సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్, త్వరలో ఈ సినిమాతో సెట్స్ పైకి రానున్నాడు.

యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. SRT ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ ఇంకా తెలియాల్సి  ఉంది.