‘ఛలో’ డైరెక్టర్ కి కారు గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్

Friday,February 16,2018 - 05:11 by Z_CLU

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య, రష్మిక మండన్న నటించిన ‘ఛలో’ సూపర్ హిట్టయింది. నాగశౌర్య సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. ఫస్ట్ మూవీ తోనే ఇంత గొప్ప సక్సెస్ ని అచీవ్ చేసిన ప్రొడ్యూసర్స్ ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ లు డైరెక్టర్ వెంకీ కుడుములకు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు.

ఛలో ఈ రేంజ్ లో సక్సెస్ అయిందంటే దానికి చాలా మంది కష్టపడ్డారని, అందుకే రిలీజ్ కి ముందే ఈ సినిమా సక్సెస్ అయితే, కంప్లీట్ టీమ్ ని సత్కరించుకోవాలని ఫిక్సయ్యామని చెప్పుకున్న ప్రొడ్యూసర్స్, ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఇంత మంచి సినిమా తీసినందుకు వెంకీ కుడుములకు థాంక్స్ చెప్తూనే, దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్తు ఉందని అభినందించారు.

నాగశౌర్య ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసిన ఈ సినిమా 2 వారాల్లో 23.31 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకి సాగర్ మహతి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.