సింగర్ గా మారిన బాలయ్య

Thursday,May 11,2017 - 06:36 by Z_CLU

పవర్ ఫుల్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ. అలాంటి బాలయ్య పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఎక్స్ పెక్టేషన్స్ పీక్ కి వెళ్ళి కూర్చున్నాయి. అలాంటిది ఈ సినిమాలో బాలయ్య పాట పాడితే..? అదే జరిగింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో బాలయ్య తన పాట పాడి సింగర్ గా మారారు. అనూప్ రూబెన్స్ ఈ పాట రికార్డింగ్ కూడా సక్సెస్ ఫుల్ కంప్లీట్ చేశాడు.

తన సినిమాల్లో హీరోలతో పాటలు పాడించడం అటు పూరి జగన్నాధ్, ఇటు అనూప్ రూబెన్స్ ఇద్దరికీ అలవాటే. ఈసారి వీళ్లిద్దరూ కలిసి బాలయ్యతో పాట పాడించారు. 101వ సినిమాకు ఇదే హైలెట్ కానుంది. బాలయ్య గొంతు ప్రేక్షకులకు కొత్త కాదు. గతంలో పలు స్టేజ్ షోలు, ప్రైవేటు పార్టీల్లో బాలకృష్ణ పాటలు పాడారు. ఈసారి ప్రొఫెషనల్ గా ఆలపించారు.

శ్రియా శరణ్, ముస్కాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య, ఓ మాస్ నంబర్ ఆలపించినట్టు తెలుస్తుంది. సినిమాకు సంబంధించి త్వరలోనే యూనిట్ అంతా పోర్చుగల్ వెళ్లబోతోంది. 40 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.