మరో హిట్టు కొట్టాడు...

Saturday,March 04,2017 - 12:18 by Z_CLU

ఎనర్జిటిక్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తన ఖాతలో మరో హిట్ వేసేసుకున్నాడు.. లాస్ట్ ఇయర్ ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ గా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వంశీ కృష్ణ దర్శకత్వంలో ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే సూపర్ టాక్ సొంతం చేసుకుంది…

నిన్న విడుదలైన ఈ సినిమా హిల్లరీయస్ కామెడీ ఎంటర్టైనర్ గా అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.. కుక్కలా కిడ్నపర్ ‘కిట్టు’ గా రాజ్ తరుణ్ పెరఫార్మెన్స్ తో పాటు పృథ్వి, రఘు బాబు, సుదర్శన్ కామెడీ సినిమాకు మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. మరి వరుస సూపర్ హిట్స్ తో హీరో గా జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ సాదిస్తాడో..చూడాలి…