ఎట్టకేలకి అనౌన్స్ చేశాడు.....

Saturday,March 04,2017 - 02:04 by Z_CLU

చాలా నెలల నుంచి తన 15 సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా సస్పెన్స్ క్రియేట్ చేసిన రామ్ ఎట్టకేలకి తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు..మొన్నటి వరకూ సిక్స్ పాక్ బాడీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ గెడ్డం తో ఏ దర్శకుడితో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడా అని ఎదురుచూసిన ఫాన్స్ కి సోషల్ మీడియా ద్వారా తన 15 సినిమాకు సంబంధించిన దర్శకుడు కిశోర్ తిరుమల పేరును అనౌన్స్ చేసేశాడు…


తన డిఫరెంట్ లుక్ తో పాటు సినిమా కూడా డిఫరెంట్ స్టయిల్ లోనే సూపర్ స్టఫ్ తో ఉండబోతుందని కూడా తెలియజేశాడు రామ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘నేను శైలజ’ సూపర్ హిట్ సాధించడంతో మళ్ళీ ఈ కాంబో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతుందా..అనే ప్రశ్నలో టాలీవుడ్ లో స్టార్ట్ అయిపోయాయి…సో తనకు సూపర్ హిట్ అందించిన దర్శకుడితో త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడన్నమాట రామ్..