'కబాలి' అలా ఆకట్టుకుంటాడట..!

Wednesday,July 20,2016 - 11:16 by Z_CLU

 

సూపర్ స్టార్ రజిని కాంత్ తాజా చిత్రం ‘కబాలి’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధమైంది. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు సినీ జనం. అయితే ఈ నెల 22 న విడుదల కానున్న కబాలి గురించి దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ” మూడో సినిమాకే రజిని సార్ తో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ అది అదృష్టమంటే నేను నమ్మను, నా కృషే అందుకు కారణం అని భావిస్తున్నా. ఇక ఈ సినిమాలో రజిని సార్ ఇప్పటి వరకు కనిపించని సరి కొత్త లుక్ తో కనిపిస్తూనే వైవిధ్య భరితమైన పాత్రలో అలరిస్తారు. అన్ని వర్గాలను అక్కట్టుకొనే అంశాలు ఈ చిత్రం లో ఉంటాయి. ఇక సూపర్ స్టార్ క్లాస్ లుక్ తో కనిపిస్తూనే మాస్ ను ఆకట్టుకుంటారు. ఇక ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో మాత్రమే చూసి ఆనందించాలని ఆశిస్తున్నా” అన్నారు.