మెహబూబా – ‘ఓ ప్రియా నా ప్రియా’ సాంగ్ రివ్యూ

Monday,April 16,2018 - 06:02 by Z_CLU

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మెహబూబా హవా బిగిన్ అయింది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది.  ‘ఓ ప్రియా.. నా ప్రియా’ అంటూ బిగిన్ అయ్యే ఈ సాంగ్, ప్రస్తుతం సోషల్ మీడియాలో యూత్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడింది.

1971 ఇండో – పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది ‘మెహబూబా’ సినిమా. అయితే ఈ రోజు రిలీజైన ఈ ఫస్ట్ సింగిల్ దేశ సరిహద్దులు, వాటి ఆంక్షల మధ్య ఒక ప్రేమ జంట ఎలాంటి పరిసస్థితులు ఎదుర్కొంది అనే, సినిమా మెయిన్ థీమ్ ని ఎలివేట్ చేస్తుంది. ‘మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు…. ప్రేమంటే ఏంటో తెలిసుంటే వాళ్ళు ఈ గీత గీసి ఉండరు..’ లాంటి లిరిక్స్ భాస్కర భట్ల మార్క్ ని ఎలివేట్ చేస్తున్నాయి. ప్రగ్యా దాస్ గుప్తా, సందీప్ బాత్రా ఈ సాంగ్ పాడారు.

మే 11 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో పూరి ఆకాష్, నేహా శెట్టి జంటగా నటించారు. సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.