‘నా పేరు సూర్య’ ఆడియో లాంచ్ – పర్ఫెక్ట్ వెన్యూ

Monday,April 16,2018 - 05:16 by Z_CLU

ఈ నెల 22 న గ్రాండ్ గా ‘నా పేరు సూర్య’ ఆడియో లాంచ్ ప్లాన్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే అన్ని సినిమాల్లా ఈ ఈవెంట్ కోసం పెద్ద సిటీని ప్రిఫర్ చేయకుండా, మిలిటరీ మాధవరంలో జరుకోనుంది సినిమా యూనిట్. పశ్చిమ  గోదావరి డిస్ట్రిక్ట్ లోని  తాడేపల్లి గూడెం లో ఉండే ఈ గ్రామంలో ఈ ఈవెంట్ ని జరుపుకోవడానికి ఒక స్ట్రాంగ్ రీజనే ఉంది.

మిలిటరీ మాధవరానికి ఒక హిస్టరీ ఉంది. ఈ ఊళ్ళో ప్రతి ఇంట్లో ఒక సైనికుడుంటాడు. బ్రిటీష్ కాలం నుండే ఈ ఊరి నుండి చాలా మంది యువకులు సైన్యంలో ఉండటమే కాదు, 2 వ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఇక్కడి నుండి చాలా మంది పాల్గొన్నారు.  అందుకే ఈ ఊరికి మిలటరీ మాధవరం అనే పేరు వచ్చింది. ఇక ‘నా పేరు సూర్య’ విషయానికి వస్తే, కంప్లీట్ మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా కాబట్టి, ఈ ఊరి కన్నా బెస్ట్ వెన్యూ ఉండదని ఫిక్స్ అయ్యారు ఫిల్మ్ మేకర్స్.

ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. అయితే ఈ నెల  22 న జరగనున్న ఈ ఈవెంట్ లో తక్కిన సాంగ్స్ ని రిలీజ్ చేయడంతో పాటు,  సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకోనుంది నా పేరు సూర్య టీమ్. ఈ సినిమా మే 4 న రిలీజవుతుంది.